నేడు బీజేపీ బూత్ కమిటీ సమ్మేళనం

నేడు బీజేపీ బూత్ కమిటీ సమ్మేళనం
  • ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 దాకా ప్రోగ్రాం
  • వర్చువల్​గా మాట్లాడనున్న జేపీ నడ్డా, బండి సంజయ్​
  • 119 సెగ్మెంట్లలో ఎల్ఈడీ  స్క్రీన్​ల ఏర్పాటు

హైదరాబాద్, వెలుగు : రాష్ట్ర వ్యాప్తంగా 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బూత్ కమిటీ సమ్మేళనాలు శనివారం బీజేపీ నిర్వహించనుంది. 34,600 బూత్ కమిటీలకు చెందిన 7.26 లక్షల మంది కార్యకర్తలు పాల్గొంటారు. వీరందరిని ఉద్దేశిస్తూ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వర్చువల్​గా మాట్లాడుతారు. అంతకుముందు బీజేపీ స్టేట్ ఆఫీస్​ నుంచి బండి సంజయ్ కూడా దిశానిర్దేశం చేస్తారు. ఉదయం 10 గంటలకు పార్టీ సభ్యుల రిజిస్ట్రేషన్ తో ఈ ప్రోగ్రామ్​ ప్రారంభం అవుతుంది. 63591 19119 అనే నంబర్ కు మిస్డ్ కాల్ ఇవ్వడంతో ఈ సమ్మేళనంలో భాగస్వాములవుతారు. మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల దాకా నడ్డా మాట్లాడుతారు. ఈ సమ్మేళనంలోనే ‘సరళ్’ యాప్ ను నడ్డా ప్రారంభిస్తారు. ప్రతీ నియోజకవర్గంలో జరుగనున్న సమ్మేళనంలో బూత్ కమిటీ సభ్యులు, శక్తి కేంద్రాల ఇన్​చార్జ్​లు, మండలాధ్యక్షులతో పాటు నియోజకవర్గ కన్వీనర్,  ప్రభారీ, విస్తారక్, పాలక్ లు పాల్గొంటారు. ప్రతీ సెగ్మెంట్​లో ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. టెక్నికల్ ప్రాబ్లమ్ ఏర్పడకుండా పార్టీ తరఫున ఐటీ టీంలు ఏర్పాటు చేశారు.

ఈ సమ్మేళనంలో పలువురు పార్టీ ముఖ్య నేతలు వివిధ నియోజకవర్గాల్లో పాల్గొంటారు. జూబ్లీహిల్స్ లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ముషీరాబాద్ లో ఎంపీ లక్ష్మణ్, ధర్మపురిలో మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి, కూకట్ పల్లిలో విజయశాంతి, గద్వాల్ లో డీకే అరుణ, మహబూబ్ నగర్ లో మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, చేవెళ్లలో కొండా విశ్వేశ్వర్ రెడ్డి, మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మెదక్ లో ధర్మపురి అర్వింద్, దుబ్బాకలో రఘునందన్ రావు పాల్గొంటారు. బీజేపీ స్టేట్​ఆఫీస్​లో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్​రెడ్డి మాట్లాడారు. తెలంగాణలో బీజేపీనే బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయ పార్టీ అని అన్నారు. బూత్​ కమిటీ సమ్మేళనంలో పాల్గొనాలని సూచించారు.