రఘునందన్‌‌‌‌‌‌‌‌ వెహికల్‌‌‌‌‌‌‌‌ 20 సార్లు తనిఖీ

రఘునందన్‌‌‌‌‌‌‌‌ వెహికల్‌‌‌‌‌‌‌‌ 20 సార్లు తనిఖీ

సిద్దిపేట, వెలుగు: దుబ్బాకలో ఎలక్షన్‌‌‌‌‌‌‌‌ కోడ్‌‌‌‌‌‌‌‌ అమల్లోకి వచ్చిన తర్వాత బీజేపీ క్యాండిడేట్‌‌‌‌‌‌‌‌ రఘునందన్‌‌‌‌‌‌‌‌ వెహికల్‌‌‌‌‌‌‌‌ను పోలీసులు ఇప్పటివరకు 20 సార్లు చెక్‌‌‌‌‌‌‌‌ చేశారు. ఆయన అనుచరుల వాహనాలనూ గంటలకొద్దీ తనిఖీ చేశారు. ఈ వారం రోజుల్లో సిద్దిపేట, మెదక్‌‌‌‌‌‌‌‌ జిల్లాల్లో రఘునందన్‌‌‌‌‌‌‌‌ వెహికల్‌‌‌‌‌‌‌‌ను మూడు సార్లు చెక్‌‌‌‌‌‌‌‌ చేశారు. కార్యకర్తల వాహనాల టైర్ల గాలి తీసి మరీ చూశారు. బీజేపీ కార్యకర్త వంశీకృష్ణ వెహికల్‌‌‌‌‌‌‌‌ను గత మంగళవారం తుప్రాన్‌‌‌‌‌‌‌‌లో మూడు గంటల పాటు తనిఖీ చేసి అదే రోజు రాత్రి దుబ్బాకలో 9 గంటలు చెక్‌‌‌‌‌‌‌‌ చేశారు. సోమవారం రఘునందన్ మామ ఇంట్లో సోదాల సందర్భంగా పోలీసులు బూట్లతో ఇంట్లో తిరుగుతూ హంగామా చేశారు. పసిపాప పైనుంచి దాటుకుంటూ తిరిగారు.

నోటీసులు లేకుండా సోదాలా?: రఘునందన్​రావు

ఎలాంటి ముందస్తు నోటీసులు లేకుండా ముసుగులు వేసుకున్న మఫ్టీ పోలీసులు తన మామ రాంగోపాల్ రావు ఇంట్లో సోదాలు ఎలా నిర్వహిస్తారని రఘునందన్‌‌‌‌ రావు ప్రశ్నించారు.  ఇంట్లోకి  రాగానే తన భార్య తో పాటు ఇంట్లోని వారి ఫోన్లను లాక్కొని మాట్లాడనివ్వకుండా చేశారని చెప్పారు. తన కుటుంబ సభ్యులు ఎవరూ ఫోన్​లో అందుబాటులోకి  రాకపోవడంతో ఏం జరుగుతున్నదని ఆరా తీయగా, తన మామ ఇంటికి పెద్దసంఖ్యలో పోలీసులు వచ్చిన విషయం తెలిసిందన్నారు. సోదాల్లో ఎలాంటి డబ్బు దొరకలేదని పేర్కొన్నారు. తమ ఇంటికి వచ్చిన వారు పోలీసులో కాదో తెలియని పరిస్థితి ఏర్పడిందని అన్నారు. తమ కుల పెద్ద ఇంట్లో డబ్బులు దొరికితే అవి తనవని చెబుతున్న తీరు, అప్రజాస్వామికమని మండిపడ్డారు. సోదాల సందర్భంగా పోలీసులు అమానవీయంగా వ్యవహరించారని, ఇంట్లో పసిగుడ్డును కాళ్లతో తన్నడమే కాకుండా ఇల్లంతా చిందర వందర చేశారని ఆయన అన్నారు.

For More News..

పోలీసులు గులాబీ అంగీలు తొడుక్కున్నరా?

చెరువును పూడ్చి కలెక్టరెట్ నిర్మాణం.. వరదనీటిలో మునక..

ఫ్రెండ్స్​తో కలిసి చెల్లిని గ్యాంగ్​రేప్​ చేసిన అన్న