హత్యా రాజకీయాలను ఎప్పుడూ సమర్థించం

హత్యా రాజకీయాలను ఎప్పుడూ సమర్థించం

హైదరాబాద్: హత్యా రాజకీయాలను తాము ఎప్పుడు సమర్థించమన్నారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్. గురువారం మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యాయత్నంపై ప్రెస్ మీట్ లో మాట్లాడిన ఆయన.. బీజేపీని అప్రతిష్టపాలు చేసేందుకు సీఎం కుట్ర చేస్తున్నారన్నారు. తప్పు చేసిన వాళ్లకు శిక్ష పడాల్సిందేనని.. అవినీతి ఆరోపణలు ఎదుర్కుంటున్న మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను కాపాడే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. అవినీతిని బయటకు తీస్తుంటే అక్రమ కేసులు పెడుతున్నారన్న బండి సంజయ్.. పోలీస్ వ్యవస్థను అపహాస్యం చేశారన్నారు. FIRలో డీకే అరుణ, జితేందర్ రెడ్డి పేర్లు ఉన్నాయా అని ప్రశ్నించారు. పోలీస్ స్టేషన్ కు వెళితే న్యాయం జరుగుతుందని ప్రజల్లో నమ్మకం పోయిందన్నారు బండి సంజయ్.

కొంతమంది అధికారులు తొత్తుల్లా మారారని తెలిపారు. సీఎం ఆఫీస్ నుంచే స్క్రీన్ ప్లే, డైరెక్షన్.. సినిమా రిలీజ్ కాకముందే.. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలోనే డ్రామా ప్లాన్ వేశారన్నారు. చివరకు ఇన్వెస్టిగేషన్ అధికారులే బలవుతారన్నారు. తమకు ప్రాణహాని ఉందని బాధితులే మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేశారని.. చట్టాన్ని కాపాడాల్సినవారే చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారని తెలిపారు. అవినీతిని బయటకు తీస్తుంటే అక్రమ కేసులు పెడుతున్నారని.. నిజాలను బయటపెట్టాలనుకునేవారినే కుట్రదారులు అంటున్నారన్నారు. అవినీతి మంత్రుల్ని మంచోళ్లుగా చూపే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. కుట్రపై ఉన్నతస్థాయి విచారణ జరగాలని తెలిపారు బండి సంజయ్.

మరిన్ని వార్తల కోసం

 

విద్యార్థుల గురించి వస్తున్న వార్తల్లో నిజం లేదు

ఎయిర్ పోర్టులో యువతికి స్వీట్లు తినిపించిన పేరంట్స్