ఎయిర్ పోర్టులో యువతికి స్వీట్లు తినిపించిన పేరెంట్స్

ఎయిర్ పోర్టులో యువతికి స్వీట్లు తినిపించిన పేరెంట్స్

ఉక్రెయిన్‌లో అనేకమంది భారతీయ విద్యార్థులు చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. అయితే వారిని క్షేమంగా ఇంటికి చేర్చేందుకు మోడీ సర్కార్ ఆపరేషన్ గంగా పేరుతో ప్రత్యేక విమానాలను నడుపుతోంది. ఇప్పటికే వందల సంఖ్యలో విద్యార్థుల్ని భారత్‌కు తీసుకొచ్చింది. తాజాగా ఢిల్లీ ఎయిర్ పోర్టుకు చేరుకున్న ఓ విద్యార్థికి ఆమె తల్లిదండ్రులు ఘన స్వాగతం పలికారు. యుద్ధ భూమి ఉక్రెయిన్ నుంచి క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చిన ఉజ్వల గుప్తా అనే యువతిని ఆమె తల్లిదండ్రులు ఆనందంతో స్వాగతం పలికారు. ఎయిర్ పోర్టులో హడావుడి చేశారు. 

ఉజ్వలకు పూలమాలలు వేశారు. స్వీట్లు తినిపించిన ఆమె తల్లి.. ఆనందంతో ఉజ్వలను కౌగిలించుకున్నారు. ఇక ఆమె బంధువులు సైతం ఎయిర్ పోర్టుకు వచ్చి పూలమాలలు వేశారు..కొందరు పుష్పగుచ్చాలను కూడా అందించారు. ఈ సందర్భంగా ఉజ్వల మాట్లాడుతూ.. భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపింది. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులందర్నీ తరలించడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల్ని ఆమె అభినందించింది.కైవ్, ఖార్కివ్‌లలో పరిస్థితి తీవ్రంగా ఉన్నందున అక్కడ విద్యార్థులను వెంటనే తీసుకురావాలని ప్రభుత్వాన్ని ఉజ్వల కోరింది.