రాష్ట్రంలో ఆపరేషన్ ఆకర్ష్కు సిద్ధమైన బీజేపీ

రాష్ట్రంలో ఆపరేషన్ ఆకర్ష్కు సిద్ధమైన బీజేపీ

రాష్ట్ర బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్కు సిద్ధమైంది. పార్టీ స్టేట్ ఆఫీస్ లో బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్ ఆధ్యర్యంలో సమన్వయ కమిటీ, ఫైనాన్స్, ప్రజా సమస్యలు, టీఆర్ఎస్ వైఫల్యాల కమిటీ సమావేశమై కీలక నిర్ణయాలు తీసుకుంది. జిల్లాలవారీగా చేరికలపై అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలు చర్చించారు. చేరికల సమన్వయ కమిటీ కన్వీనర్ గా ఈటల రాజేందర్ ను నియమించిన  అనంతరం తొలిసారి ఈ సమావేశం జరిగింది. టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలను పార్టీలో చేర్చుకునేలా కమలనాథులు ప్లాన్ చేస్తున్నారు. ఈ భేటీలో ఎంపీ అర్వింద్ తో పాటు ఎమ్మెల్యే రఘునందన్, కోర్ కమిటీ సభ్యుడు వివేక్ వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.

పార్టీ బలోపేతం కోసం నేతలు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఒక్కో నియోజకవర్గంలో నలుగురు ముఖ్య నేతలు 10 రోజులు ఉండాలని రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్ ఆదేశించారు. ఆ సమయంలో నియోజకవర్గంలోని సమస్యలపై అధ్యయనం చేయాలని సూచించారు. 119 నియోజకవర్గాల్లోని అన్ని మండలాల్లో బైక్ ర్యాలీల్లో పాల్గొనాలని ముఖ్యనేతలెవరూ కార్లు వాడొద్దని తరుణ్ చుగ్ స్పష్టం చేశారు.