హుజూర్ నగర్ లో డబ్బుల పంపిణీపై ఈసీకి బీజేపీ ఫిర్యాదు

హుజూర్ నగర్ లో డబ్బుల పంపిణీపై ఈసీకి బీజేపీ ఫిర్యాదు

హుజూర్ నగర్ ఉప ఎన్నికపై కేంద్ర ఎన్నికల కమిషన్ కి ఫిర్యాదు చేశారు బీజేపీ నేతలు మురళీధర్ రావు, లక్ష్మణ్, వివేక్ వెంకటస్వామి, వీరేందర్ గౌడ్. ఉప ఎన్నికలో అధికార పార్టీ TRS విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు చేస్తుందన్నారు. అధికారాన్ని ఉపయోగించుకొని.. ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారని ఆరోపించారు. అందులో భాగంగానే సర్పంచ్ లను పోటీ చేయకుండా అడ్డుకున్నారని, అక్కడ ఉన్న అధికారులపై నమ్మకం లేదని ఫిర్యాదులో తెలిపారు బీజేపీ నేతలు.

తెలంగాణ సర్పంచ్ ల సంఘం అధ్యక్షుడు భూమన్న యాదవ్ అరెస్ట్ అక్రమమన్నారు టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం.  సర్పంచ్ లతో పాటు ఉప సర్పంచ్ లకు ఉమ్మడి చెక్ పవర్ వంటి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే ఉద్దేశంతోనే హుజూర్ నగర్ లో భూమన్న నామినేషన్ వేసేందుకు ప్రయత్నించారని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజల ప్రాథమిక హక్కులను కాలరాస్తోందని  మండిపడ్డారు కోదండరాం.