మహారాష్ట్రలో మాదే ప్రభుత్వం… బీజేపీ ధీమా

మహారాష్ట్రలో మాదే ప్రభుత్వం… బీజేపీ ధీమా

మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు ప్లాన్ B అమలు చేసే ప్రయత్నాల్లో ఉంది బీజేపీ. ఏ సమయంలోనైనా మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తామంటున్నారు బీజేపీ నేతలు. దేవేంద్ర ఫడ్నవిస్ నేతృత్వంలోనే ప్రభుత్వం ఏర్పడుతుందని స్పష్టం చేశారు. శివసేన కోసం తమ డోర్లు తెరిచే ఉంటాయని బీజేపీ నేతలు చెబుతున్నారు. మరోవైపు.. శివసేనతో సంప్రదింపుల బాధ్యతను కేంద్రమంత్రి గడ్కరీకి అప్పగించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే RSS చీఫ్ మోహన్ భగవత్ తో భేటీ అయ్యారు మహారాష్ట్ర చీఫ్ మినిస్టర్ దేవేంద్రఫడ్నవీస్. ఇక.. ఎన్సీపీ, కాంగ్రెస్ నేతలు గవర్నర్ ను కలిశారు. ప్రభుత్వ ఏర్పాటులో ఆలస్యంపై గవర్నర్ తో మాట్లాడినట్టు తెలుస్తోంది.