రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ కుట్రలు ..గాంధీ, నెహ్రూ చరిత్రను చెరిపేసేందుకు పన్నాగం

రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ కుట్రలు ..గాంధీ, నెహ్రూ చరిత్రను చెరిపేసేందుకు పన్నాగం
  • మేధావులు, విద్యావంతులు మేల్కొవాలె
  • టీపీసీసీ ప్రెసిడెంట్​ మహేశ్​ కుమార్ గౌడ్​ కామెంట్స్

నిజామాబాద్​, వెలుగు: రాజ్యాంగ్యాన్ని మార్చేందుకు బీజేపీ కుట్రలు చేస్తుందని టీపీసీసీ ప్రెసిడెంట్​ మహేశ్​ ​కుమార్​గౌడ్​ ఆరోపించారు. గాంధీ, నెహ్రూ చరిత్రను చెరిపేసేందుకు పన్నాగం పన్నుతున్నారని విమర్శించారు. 

విద్యావంతులు, మేధావులు బలంగా తిప్పికొట్టాలని సూచించారు. బుధవారం రాజ్యాంగ వజ్రోత్సవాల సందర్భంగా నిజామాబాద్ సిటీలో అంబేద్కర్​ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. 

లౌకికవాదం, స్వేచ్ఛ, సమానత్వ ప్రజాస్వామ్య పునాదిగా రాజ్యాంగ రూపకల్పన జరిగిందని, దీన్ని రచించిన అంబేద్కర్​ ప్రపంచ గుర్తింపు పొందిన మేధావి కొనియాడారు. యువత రాజ్యాంగాన్ని చదివి అవగాహన పెంచుకోవాలని సూచించారు. అంతకుముందు నీలకంఠేశ్వర్​ఆలయంలో పూజలు చేశారు. అర్చకులు  పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఆయన వెంట వ్యవసాయ కమిషన్​సభ్యుడు గడుగు గంగాధర్​ తదితరులు ఉన్నారు.