
బడ్జెట్ పై చర్చ జరగకుండానే జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశాన్ని వాయిదా వేయడంపై బీజేపీ కార్పొరేటర్లు మండిపడుతున్నారు. బల్ధియా ఆఫీస్ ముందు ధర్నాకు దిగారు. రాష్ట్రప్రభుత్వం, మేయర్ తీరుకు నిరసనగా సేవ్ డెమోక్రసీ ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేస్తున్నారు. మేయర్ గద్వాల్ విజయలక్ష్మీ ఛాంబర్ ముందు కాంగ్రెస్ కార్పొరేటర్లు ఆందోళన చేస్తున్నారు.
బడ్జెట్ పై ఎలాంటి చర్చ లేకుండానే సమావేశాన్ని మేయర్ గద్వాల్ విజయలక్ష్మీ వాయిదా వేశారు. బడ్జెట్ ఆమోదం అయిపోయిందని..స్టాండింగ్ కమిటీ ఆమోదం కూడా పొందిందని చెప్పారు. అంతకముందు విపక్ష సభ్యులు పోడియం దగ్గరికి నిరన తెలపడంపై మేయర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బల్దియాలో ఏ ఒక్క సమస్య పరిష్కారం కావడం లేదని బీజేపీ కార్పొరేటర్లు ఆరోపించారు. కాంట్రాక్టర్ల కాళ్లు మొక్కినా పనులు కావడం లేదన్నారు.