
కామారెడ్డిటౌన్, వెలుగు: ప్రజల సంక్షేమమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని బీజేపీ జిల్లా జనరల్ సెక్రటరీ బి.నరేందర్రెడ్డి అన్నారు. మహా సంపర్క్ అభియాన్కార్యక్రమంలో భాగంగా ఆదివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో ప్రధాని మోదీ ఆధ్వర్యంలో చేపట్టిన అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలపై అవగాహన కల్పించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదంటూ కరపత్రాలు, స్టిక్కర్ల ద్వారా ప్రజలకు వివరించారు.
రాష్ట్రంలో చేపడుతున్న అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాల్లో కేంద్ర ప్రభుత్వ నిధులు ఉన్నాయని తెలిపారు. కామారెడ్డి నియోజక వర్గంలో ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందిస్తున్నారని పేర్కొన్నారు. టౌన్ ప్రెసిడెంట్మోటూరి శ్రీకాంత్, అసెంబ్లీ కన్వీనర్ కుంట లక్ష్మారెడ్డి, నాయకులు శ్రీనివాస్, వేణు, రజనీకాంత్, లక్ష్మీపతి, రఘు తదితరులున్నారు.