మత కలహాలతో గెలవాలని బీజేపీ కుట్ర

మత కలహాలతో గెలవాలని బీజేపీ కుట్ర

రాయిదిగి: ఎన్నికల్లో గెలుపు కోసం బెంగాల్ లో మత కలహాలకు బీజేపీ కుట్ర పన్నుతోందని తృణమూల్ అధినేత్రి, ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. సౌత్ 24 పరగణాల జిల్లాలోని రాయిదిగిలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆమె పాల్గొన్నారు. ముస్లింలు బీజేపీ ఉచ్చులో పడి ఎంఐఎంకు ఓటెయ్యొద్దని కోరారు. ఆ రెండు పార్టీల మధ్య రహస్య స్నేహం ఉందన్నారు. బీజేపీ గెలిస్తే సీఏఏ, ఎన్ఆర్సీ చట్టాలను అమలు చేస్తుందన్నారు. ఇది ముమ్మాటికీ బెంగాల్ ప్రజల మధ్య చీలిక తీసుకురావడమేనని చెప్పారు. అస్సాంలో ఎన్ఆర్సీ లిస్ట్ లో 14 లక్షల బెంగాలీలు, బిహారీలను తొలగించడమే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. బీజేపీ మీద యుధ్ధంలో సోదరీమణులు, మహిళలు కలసి రావాలని పిలునిచ్చారు.