రాహుల్ను వేధించడంపైనే ఫోకస్

రాహుల్ను వేధించడంపైనే ఫోకస్
  • సీఎల్పీ లీడర్​ భట్టి విక్రమార్క

మహబూబ్​నగర్, వెలుగు: అక్టోబర్​ 2వ తేదీ నుంచి కాంగ్రెస్ అధినేత రాహుల్‌‌‌‌ గాంధీ చేపట్టనున్న ‘భారత్​ జోడో’ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తోందని సీఎల్పీ లీడర్​భట్టి విక్రమార్క ఆరోపించారు. అక్రమ కేసులు బనాయించి, ఈడీ విచారణ పేరుతో సోనియాగాంధీ, రాహుల్​ను వేధిస్తున్నారని విమర్శించారు. మహబూబ్​నగర్​ జిల్లా కేంద్రంలో శుక్రవారం మధ్యాహ్నం పాస్ పోర్ట్ ఆఫీస్​ ఎదుట కాంగ్రెస్ జిల్లా కమిటీ చేప‌‌‌‌ట్టిన నిర‌‌‌‌స‌‌‌‌న కార్యక్రమానికి ఆయన చీఫ్​ గెస్ట్​గా హాజరై మాట్లాడారు.

ప్రజలకు అచ్చేదిన్​ తీసుకొస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం, ఇప్పుడు నిత్యావసరాల ధరలను పెంచి ప్రజలు సచ్చేదిన్​ తీసుకొచ్చిందని ఫైర్​అయ్యారు. ఈడీ, సీబీఐ, ఐటీ, న్యాయస్థానాలను త‌‌‌‌న గుప్పిట్లో పెట్టుకొని ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలు లేకుండా చేయాల‌‌‌‌ని కేంద్రం కుట్రలు చేస్తోందని అన్నారు. కాంగ్రెస్​కు చెందిన యంగ్ ఇండియా, నేష‌‌‌‌న‌‌‌‌ల్ హెరాల్డ్ ప‌‌‌‌త్రికలో మ‌‌‌‌నీ లాండ‌‌‌‌రింగ్ ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. గతంలో విచారణ చేసి ఏం లేదని తేల్చి కేసును మూసివేశారని అన్నారు.

రాహుల్ గాంధీ నిర్వహించనున్న పాదయాత్రతో బీజేపీ బండారం బయటపడుతుందని, తిరిగి ఈ కేసును పునఃప్రారంభించారని ఆరోపించారు. ఎన్ని కుట్రలు చేసి అడ్డంకులు సృష్టించినా భారత్ జోడో పాదయాత్రను ఆపడం మోడీ తరం కాదని అన్నారు. అంతకుముందు పార్టీ ఆఫీస్​ నుంచి పాస్​పోస్ట్​ ఆఫీస్​ వరకు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా ప్రెసిడెంట్​ఒబేదుల్లా కొత్వాల్, జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్, ఎంపీపీ కాంతమ్మ, లీడర్లు జి.మధుసూదన్​రెడ్డి, ప్రదీప్​కుమార్​గౌడ్ తదితరులు పాల్గొన్నారు.