నిర్మల్, వెలుగు: నిర్మల్‌జిల్లా ముథోల్ మండల కేంద్రంలోని ఓ పోలింగ్ కేంద్రం వద్ద ఓటు వేసి బయటకు వచ్చిన వారి చేతి వేలిపై ఉన్న సిరా చుక్కను చెరిపేస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. అర్బాజుద్దీన్ అనే వ్యక్తి పోలింగ్ కేంద్రానికి సమీపంలో లివాన్ అనే హెయిర్ సిరమ్తో కొంతమంది ఓటర్ల వేలిపై ఉన్న సిరా గుర్తును తుడిపేస్తున్నాడు. గమనించిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొని హెయిర్ సిరంను స్వాధీనం చేసుకొని విచారణ జరుపుతున్నారు.
