జన్నారం, వెలుగు: మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కొత్తపేట గ్రామపంచాయితీ నుంచి సర్పంచ్‌గా ఇటీవల గెలుపొందిన బీఆర్ఎస్ సీనియర్ నేత దినేశ్ నాయక్ బుధవారం ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ సమక్ష్యంలో కాంగ్రెస్‌లో చేరారు. పార్టీలో చేరిన దినేశ్‌కు బొజ్జు కండువా కప్పి కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా దినేశ్ నాయక్ మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితుడినై కాంగ్రెస్‌లో చేరానని, ఎమ్మెల్యే ఆధ్వర్యంలో కాంగ్రెస్ అభ్యున్నతి కోసం పనిచేస్తానని తెలిపారు. గ్రామాన్ని అభివృద్ధి చేస్తానన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల ప్రెసిడెంట్ ముజాఫర్ అలీఖాన్, కొత్తపేట కాంగ్రెస్ నేత గున్నాల ప్రసాద్ గౌడ్ తదితరులున్నారు.
