ఓల్డ్ సిటీ, వెలుగు: తాను యూట్యూబ్రిపోర్టర్నని, అరెస్ట్కాకుండా చూస్తానంటూ ఒకరిని బెదిరించి, డబ్బులు డిమాండ్చేసిన వ్యక్తిని అరెస్ట్చేసినట్లు సౌత్జోన్డీసీసీ కిరణ్ఖరే, శాలిబండ సీఐ మహేశ్తెలిపారు. శాలిబండకు చెందిన మహమ్మద్ఫారూక్అల్లుండ్లను ఓ కేసు విషయంలో అరెస్ట్కాకుండా చూస్తానని స్థానికుడు, యూట్యూబ్రిపోర్టర్గా చెప్పుకుంటున్న మహమ్మద్బిలాల్చెప్పాడు.
ఇందుకోసం ఫారూక్ను రూ.35 వేలు డిమాండ్చేశాడు. ఇవ్వకపోతే నీ అల్లుండ్లను అరెస్ట్చేయిస్తానని బెదిరించాడు. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశాడు. నిందితుడిని బుధవారం అరెస్ట్చేసినట్లు డీసీపీ తెలిపారు. మీడియా పేరిట అక్రమాలకు పాల్పడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇలాంటి బాధితులు ఎవరైనా ఉంటే నేరుగా తన ఆఫీస్కు వచ్చి కలవాలని సూచించారు.
