వెంటనే వెళ్లిపో.. లేకుంటే ఇక్కడే బైఠాయిస్తా..సీఐకి ఎమ్మెల్యే కోవ లక్ష్మి వార్నింగ్

వెంటనే వెళ్లిపో.. లేకుంటే ఇక్కడే బైఠాయిస్తా..సీఐకి ఎమ్మెల్యే కోవ లక్ష్మి వార్నింగ్
  • ఇద్దరి మధ్య వాగ్వాదం

ఆసిఫాబాద్, వెలుగు: కాంగ్రెస్ నాయకులకు ఒక రూల్, బీఆర్ఎస్ నేతలకు ఇంకో రూలా అంటూ ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి సీఐపై ఫైర్​అయ్యారు. ఆసిఫాబాద్ మండలంలో బుధవారం మూడో విడత ఎన్నికలు జరుగుతుండగా రాజంపేట్ పోలింగ్ కేంద్రానికి సమీపంలోని ఎమ్మెల్యే కోవ లక్ష్మి నివాసం వద్ద ఆ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున గుమిగూడారు. దీంతో ఆసిఫాబాద్ ​సీఐ బాలాజీ వరప్రసాద్ అక్కడికి చేరుకొని అందరినీ చెదరగొట్టారు. గమనించిన ఎమ్మెల్యే లక్ష్మి అక్కడికి వెళ్లి పోలింగ్ ​కేంద్రానికి 100 మీటర్లకు దూరంగా ఉన్నవారిపై ప్రతాపం చూపించడం ఏమిటని ప్రశ్నించారు. 

వెంటనే ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని లేకపోతే ఇక్కడే
(రోడ్డుపై) బైఠాయిస్తానని సీఐని హెచ్చరించారు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. అధికార పార్టీ నాయకులకు వత్తాసు పలుకుతూ తమ పార్టీ వారిని చెదరగొట్టడం ఏమిటని నిలదీశారు. గవర్నమెంట్ తొత్తులుగా పనిచేస్తున్నారని మండిపడ్డారు. దీంతో సీఐ అక్కడినుంచి వెళ్లిపోయారు.