ముంబై: బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం అస్థిరమైందని, అది ఎక్కువ కాలం కొనసాగదని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. శుక్రవారం శివసేన(యూబీటీ) చీఫ్ఉద్ధవ్ ఠాక్రేతో ఆమె సమావేశమయ్యారు. ఆ తర్వాత ఠాక్రేతో కలిసి ఆమె మీడియాతో మాట్లాడారు. ‘‘కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అస్థిరమైనది. ఆ సర్కారు పూర్తికాలం కొనసాగ దు. ఆట ఇప్పుడే ప్రారంభమైంది. కొనసాగుతుం ది” అని తెలిపారు.
ఎమర్జెన్సీ విధించిన1975 జూన్ 25ను కేంద్రం.. ‘సంవిధాన్ హత్యా దివస్’ గా పాటించడంపైనా దీదీ స్పందించా రు. ప్రధాని మోదీ హయాంలోనే ఎమర్జెన్సీ కాలం నాటి పరిస్థితులు ఎక్కువగా కనిపించా యని తెలిపారు. కొత్త న్యాయ చట్టాలను తీసుకొస్తున్నప్పుడు కేంద్రం ఎవరినీ సంప్రదించ లేదన్నారు. పెద్ద సంఖ్యలో ఎంపీలను సస్పెండ్ చేసి దీనిని రూపొందించారని, కొత్త చట్టాలతో చాలామంది ప్రజలు భయ పడుతున్నారని మమతా బెనర్జీ పేర్కొన్నారు.