ప్రతి హిందూ ఇంటిపై కాషాయ జెండా .. శ్రీరామనమి సందర్భంగా బీజేపీ నిర్ణయం

ప్రతి హిందూ ఇంటిపై కాషాయ జెండా .. శ్రీరామనమి సందర్భంగా బీజేపీ నిర్ణయం

హైదరాబాద్, వెలుగు: ఈ నెల17న శ్రీరామ నవమి పండుగను ఘనంగా నిర్వహించాలని బీజేపీ నిర్ణయించింది. ప్రతి హిందువు ఇంటిపై కాషాయ జెండా పెట్టేలా పార్టీ హైకమాండ్ ప్లాన్ చేసింది. కార్యక్రమంలో పాల్గొనేటప్పుడు కేవలం కాషాయ కండువాలు మాత్రమే ధరించాలని, బీజేపీ పార్టీ కండువాలను వాడొద్దని పార్టీ నేతలను, కార్యకర్తలను ఆదేశించింది. దాంతో సోమవారం నుంచి మూడు రోజుల పాటు ఈ ప్రోగ్రామ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రామమందిరం నిర్మాణానికి మోదీ చేసిన కృషిని, పదేండ్ల బీజేపీ పాలననూ ప్రజలకు వివరించనుంది. 

ఇవ్వాల, రేపు ఇంటింటికీ బీజేపీ

ఈ నెల15,16 తేదీల్లో ఇంటింటికీ బీజేపీ కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు తెలిపారు. మోదీ చేసిన అభివృద్ధిపై కరపత్రం, స్టిక్కర్, బీజేపీ జెండాను ప్రతి ఇంటికీ ఇవ్వాలని తీర్మానించినట్టు వెల్లడించారు. మోదీ రిలీజ్ చేసిన మేనిఫెస్టోపైనా ప్రతి ఇంట్లో చర్చ జరిగేలా ప్లాన్ చేస్తున్నట్టు పేర్కొన్నారు.