ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. ప్రభుత్వాన్ని నిలదీసిన బీజేపీ నేత

ఇచ్చిన హామీలు  ఏమయ్యాయి?.. ప్రభుత్వాన్ని నిలదీసిన బీజేపీ నేత

జేఎన్టీయూ, ప్రగతీనగర్ రోడ్డును 100 ఫీట్ రోడ్డుగా విస్తరణ చేస్తామని గత ఎన్నికల్లో మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే  వివేకానంద్ ఇచ్చిన హామీలు ఏమయ్యాయని బీజేపీ నేతలు ప్రశ్నించారు. సమస్యలను పరిష్కరించలేని ఎమ్మెల్యే వివేకనంద, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు వెంటనే రాజీనామా చేసి.. ప్రజలకు క్షమాపణ చెప్పాలని బీజేపీ ఉపాధ్యక్షులు శ్రీశైలం గౌడ్ డిమాండ్ చేశారు. రాబోయే ఎన్నికల్లో నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రజలు బీఆర్ఎస్ కు తగిన బుద్ది చెబుతారని అన్నారు. గత ఎన్నికల్లో బూటకపు మాటలు చెప్పి గెలుపొందిన బీఆర్ఎస్.. ప్రస్తతం ప్రజల సమస్యలను గాలికి వదిలేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు జేఎన్టీయూ, ప్రగతీనగర్ రోడ్డును 100 ఫీట్ రోడ్డుగా విస్తరణ చేయాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. ప్రగతీ నగర్ బతుకమ్మ ఘాట్ నుంచి జేఎన్టీయూ రోడ్డులోని తులసీ నగర్ వరకు నిజాంపేట బీజేపీ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు ఆకుల సతీష్ ఆధ్వర్యంలో ర్యాలీ తీశారు. బాచుపల్లి నుంచి ప్రగతీ నగర్ కమాన్ వరకు రేడియల్ రోడ్ల నిర్మించి ట్రాఫిక్ సమస్యను పరిష్కరిస్తామని ఇచ్చిన హామీలు ఏం అయ్యాయని ప్రశ్నించారు. జేఎన్టీయు, హైటెక్ సిటీ, మాదాపూర్ ప్రాంతాల్లో వాహనదారులు ట్రాఫిక్ తో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు.