ఓట్లు తొలగించడం వల్లే బీజేపీ గెలుస్తోంది: మంత్రి వివేక్ వెంకటస్వామి

ఓట్లు తొలగించడం వల్లే బీజేపీ గెలుస్తోంది: మంత్రి వివేక్ వెంకటస్వామి

ప్రతిపక్షాల ఓట్లు తొలగించడవ వల్లే బీజేపీ గెలుస్తుందన్నారు కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి. ముఖ్యంగా కాంగ్రెస్ ఓట్లు తొలగించడమే బీజేపీ టార్గెట్ అన్నారు. బీజేపీ కుట్రలను ప్రతి ఒక్కరూ తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. గురువారం (జూన్ 11) BLA లకు SIR పై అవగాహన సదస్సులో పాల్గొన్న మంత్రి.. కీలక వ్యాఖ్యలు చేశారు. 

మీనాక్షి నటరాజన్ నామినేషన్ కుట్రతోనే తిరస్కరించారని విమర్శించారు. నార్మల్ కేసుకే నామినేషన్ తిరస్కరించారని అన్నారు. SIR తో ఓట్ చోరీకి పాల్పడిన బీజేపీ..  ఇప్పుడు సీట్ చోరీకి పాల్పడుతోందని విమర్శించారు.

బెంగాల్ లో 70 లక్షల ఓట్లు తొలగించారని అన్నారు మంత్రి వివేక్. ఇటీవల మమత 30 లక్షల ఓట్లతో ఓడిపోయిందని గుర్తు చేశారు. ఓట్లు తొలగించడం వల్ల బీజేపీ గెలుస్తోందని అన్నారు. 

చనిపోయిన ఓట్లన్న తొలగించాల్సిందేనని.. అయితే బీఎల్ ఏలు ప్రతి ఇంటికి వెళ్లి వాస్తవ పరిస్థితులు తెలుసుకోవాలన్నారు. అక్రమంగా ఓట్లు తొలగించకుండా అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. 

మంత్రి వివేక్ కామెంట్స్:

  • దేశంలో ఓటు చోరీ పై రాహుల్ గాంధీ పార్లమెంట్ లో గళం విప్పారు.
  • BLA లు పకడ్బందీగా ఇంటింటికి వెళ్ళి ఓటర్ల జాబితాను పరిశీలించాలి.
  • చనిపోయిన ఓటర్ల వివరాలను సేకరించి వారిని తొలగించాలి.
  • 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్  నేతలు మెగా ప్రాజెక్ట్ లు కట్టి కమిషన్లు దోచుకున్నారు.
  • కాంట్రాక్టర్లను ధనవంతులు గా చేశారు
  • ఇందిరమ్మ ఇండ్ల ప్రక్రియ ఎవరికి ఒక్క పైసా ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం పారదర్శకంగా చేపడుతుంది.
  • అర్హత ఉన్న ప్రతి పేద వారికి ఇందిరమ్మ ఇండ్లను కేటాయించుటమే కాంగ్రెస్ లక్ష్యం
  • ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యను అందిస్తూ పౌష్టికాహార భోజనం అందిస్తున్నాం.
  • BLA లు ఇంటింటికి వెళ్లినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా లేదా తెలుసుకోవాలి..
  • చెన్నూరు నియోజక వర్గంలో త్వరలోనే నర్సింగ్ కళాశాలను ఏర్పాటు
  • కాకా ఫౌండేషన్ ద్వారా 25 వందల బోర్వెల్స్ వేశాం.
  • నేను ఎమ్మెల్యే అయ్యాక రెండేండ్ల కాలంలో నీటి ఎద్దటి ఉన్న ప్రాంతాల్లో4 వందల బోర్లు వేశాను.
  • బీఆర్ఎస్ సోషల్ మీడియా ద్వారా తప్పుడు ప్రచారం చేస్తున్నారు.
  • పదేళ్లలో రేషన్ కార్డులు ఎందుకు ఇవ్వలేకపోయారు
  • డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పేరుతో ప్రజలను మోసం చేశారు