కడెం మండలంలోని 106 ఏళ్ల వయసులో కన్నుమూసిన రాజవ్వ

కడెం మండలంలోని 106 ఏళ్ల వయసులో  కన్నుమూసిన రాజవ్వ

కడెం, వెలుగు: నిర్మల్ జిల్లా కడెం మండలంలోని చిన్న బెల్లాల్ గ్రామపంచాయతీ పరిధి నర్సింగాపూర్ కు చెందిన కందుల రాజవ్వ 106 ఏండ్ల వయసులో శుక్రవారం కన్నుమూశారు. 

శతాధిక వయస్సు దాటి 106 ఏళ్ల పాటు జీవించడం అరుదైన విషయమని గ్రామస్తులు పేర్కొన్నారు. ఆమె నిరాడంబర జీవనం, కుటుంబ విలువలను పాటిస్తూ అందరికీ ఆదర్శంగా నిలిచారని గ్రామ పెద్దలు గుర్తు చేసుకున్నారు. ఆమెకు మనవలు, మునిమనవలు ఉన్నారు.