సరైన రోడ్డు లేని ములుగు జిల్లాలోని ఈ ఊరికి కాలినడకన వెళ్లి.. వైద్యం అందించి..

సరైన రోడ్డు లేని ములుగు జిల్లాలోని ఈ ఊరికి కాలినడకన వెళ్లి.. వైద్యం అందించి..

సరైన రోడ్డు లేని ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం లక్ష్మీదేవిపేట గ్రామ పరిధిలోని ఊట్లగుత్తి కోయగూడెంకు డాక్టర్, వైద్య సిబ్బంది అతి కష్టం మీద వెళ్లి వైద్య సేవలు అందించారు. గ్రామానికి సరైన రోడ్డు లేకపోవడంతో శుక్రవారం పీహెచ్​సీ డాక్టర్  శ్రీకాంత్ సిబ్బందితో కలిసి గ్రామానికి ట్రాక్టర్, కాలినడకన వెళ్లారు. 

గ్రామంలో 87 మందికి పరీక్షలు నిర్వహించి, వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. అనారోగ్య సమస్యలు తలెత్తితే నిర్లక్ష్యం చేయకుండా దవాఖానకు రావాలని సూచించారు.

వెంకటాపూర్(రామప్ప ), వెలుగు