మంచిర్యాల, హైదరాబాద్ మధ్య హైవే నిర్మించాలి : బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి

మంచిర్యాల, హైదరాబాద్ మధ్య హైవే నిర్మించాలి : బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి

మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల, -హైదరాబాద్ మధ్య ప్రస్తుతమున్న రాజీవ్ రహదారిపై అధిక ట్రాఫిక్ తోపాటు నిత్యం ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో మంచిర్యాల, కరీంనగర్, హైదరాబాద్ మధ్య కొత్త జాతీయ రహదారిని నిర్మించాలని కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి కోరారు. శుక్రవారం ఢిల్లీలో  ఆయనను కలిసి వినతిపత్రం అందజేసి మాట్లాడారు. 

మంచిర్యాల ప్రాంత ప్రజలు హైదరాబాద్ వెళ్లడానికి ప్రస్తుతం 5 గంటలకు పైగా సమయం పడుతోందని, నాగపూర్- హైదరాబాద్ నూతన గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారి మంచిర్యాల మీదుగా నిర్మిస్తే 3 గంటల్లో హైదరాబాద్ చేరుకోవచ్చని తెలిపారు. నిత్యం మంచిర్యాల నుంచి వేల వాహనాలు కరీంనగర్, హైదరాబాద్ వెళ్తూ ఉంటాయని వారికి మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించడానికి జాతీయ రహదారి మంజూరు చేయాలని కోరారు.