బెల్లంపల్లి ఎంజేపీ స్కూలు ప్రిన్సిపాల్, డిప్యూటీ వార్డెన్ సస్పెన్షన్..భోజనం వికటించి 23 మంది విద్యార్థినులు అస్వస్థత

 బెల్లంపల్లి ఎంజేపీ స్కూలు ప్రిన్సిపాల్, డిప్యూటీ వార్డెన్ సస్పెన్షన్..భోజనం వికటించి 23 మంది విద్యార్థినులు అస్వస్థత

బెల్లంపల్లి, వెలుగు: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మహాత్మా జ్యోతిబా ఫూలే స్కూల్​ ప్రిన్సిపాల్  రమాదేవి, డిప్యూటీ వార్డెన్  సుజాతను సస్పెండ్  చేస్తూ ఎంజేపీ పాఠశాలల రాష్ట్ర  కార్యదర్శి బి.సైదులు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 22న స్కూల్​ భోజనం వికటించి 23 మంది విద్యార్థినులు అస్వస్థకు గురవగా, ఘటనకు బాధ్యులైన ప్రిన్సిపాల్, డిప్యూటీ వార్డెన్ ను విచారణ అనంతరం సస్పెండ్  చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇన్​చార్జి  ప్రిన్సిపాల్ గా నవ్యకుమారికి బాధ్యతలు ఇచ్చారు.