హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో బీజేపీ ముఖ్య నేతలు మంగళవారం శంషాబాద్‌లోని ఓ హోటల్‌లో సమావేశమయ్యారు. ఈ భేటీకి మున్సిపల్ ఎన్నికల ఇన్ చార్జి ఆశీశ్ శెలార్, కో–ఇన్ చార్జీలు రేఖా శర్మ, అశోక్ పర్నామి హాజరయ్యారు.
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు, రాష్ట్ర ఇన్ చార్జి అభయ్ పాటిల్, సంస్థాగత ఇన్ చార్జి చంద్రశేఖర్ తివారీ, ఎంపీలు రఘునందన్ రావు, ధర్మపురి అర్వింద్, బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రధాన కార్యదర్శులు హాజ రయ్యారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన విధివిధానాలు, ప్రచారం తీరు, అభ్యర్థుల ఎంపిక, బూత్ స్థాయి మేనేజ్మెంట్పై చర్చించారు.
