మంత్రి సబితారెడ్డికి బీజేపీ నేత సవాల్

మంత్రి సబితారెడ్డికి బీజేపీ నేత సవాల్

మంత్రి సబితా ఇంద్రారెడ్డిపై బీజేపీ నేత కొలన్ శంకర్ రెడ్డి ఫైర్ అయ్యారు. నియోజకవర్గంలో ఏం అభివృద్ధి చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. శుక్రవారం బీఆర్ఎస్ నాయకులు తనపై వ్యక్తిగత ఆరోపణలు చేశారని, వారు ఏక వచణ పదజాలంతో మాట్లాడటం సిగ్గు చేటని అన్నారు. మంత్రి సబిత ఎక్కడ రచ్చబండ ఏర్పాటుచేసినా తాము పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు. నియోజకవర్గంలో ఏం అభివృద్ధి చేశారో రచ్చబండలో ప్రజల సమక్షంలో తేల్చుకుందామని శంకర్ రెడ్డి సవాల్ విసిరారు. మహిళా కార్పొరేటర్లు పార్టీ మారేందుకు నిరాకరిస్తే పోలీస్ కేసులు పెడుతున్నారని ఆయన ఆరోపించారు.