చినజీయర్ వేసిన అక్షింతలు.. హైకోర్టు అక్షింతలు ఒకటి కావు?

చినజీయర్ వేసిన అక్షింతలు.. హైకోర్టు అక్షింతలు ఒకటి కావు?

హైకోర్టు చేత అక్షింతలు వేయించుకోవడం సీఎం కేసీఆర్ కు అలవాటుగా మారిందన్నారు బీజీపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్. చిన్న జీయర్ స్వామీ వేసే అక్షింతలకు.. హైకోర్టు వేసే అక్షింతలకు మధ్య తేడా కేసీఆర్ కు తెలియడం లేదన్నారు. హైకోర్టు వేసేది అక్షింతలు కాదు.. మెట్టికాయలన్న విషయాన్ని కేసీఆర్ తెలుసుకోవాలన్నారు. ప్రభుత్వం హైకోర్టుకు తప్పుడు నివేదికలు ఇస్తుందన్నారు. ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయటానికి కేంద్రాన్ని వాడుకోడాన్ని ఖండిస్తున్నామన్నారు.

మున్సిపల్ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తాము సిద్దంగా ఉన్నామన్నారు. అన్ని మున్సిపాలిటీలు, వార్డుల్లో బీజేపీ పోటీ చేస్తుందన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికలు బీజేపీకి సెమీ ఫైనల్స్ లాంటివన్నారు. సంఖ్యా బలాన్ని చూసుకుని కేసీఆర్ విర్రవీగుతున్నాడని అన్నారు. గాంధీ సంకల్ప యాత్రకు బీజేపీకి సంబంధం లేదనే హక్కు కాంగ్రెస్ కు లేదన్నారు లక్ష్మణ్. సోనియా గాంధీకి, మహాత్మా గాంధీకి ఏం సంబంధం? అన్నారు. గాంధీ పేరు చెప్పుకుని.. కాంగ్రెస్ పబ్బం గడుపుకుంటుందన్నారు.