కేసీఆర్ నుంచి తెలంగాణను కాపాడుకోవాలి: లక్ష్మణ్

కేసీఆర్ నుంచి తెలంగాణను కాపాడుకోవాలి: లక్ష్మణ్

కేసీఆర్ పాలన నుంచి తెలంగాణను కాపాడుకోవాలన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్. ఈ రోజు మీడియాతో మాట్లాడిన ఆయన…  రాష్ట్రంలో టీఆర్ఎస్ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తుందని… కవిత, వినోద్ లు ఎంపీలుగా ఓడిపోవడంతో ఓటమి భయం పట్టుకుందని చెప్పారు లక్ష్మణ్. కారు టీఆర్ఎస్ దే కానీ… స్టీరింగ్ మాత్రం MIM దేనని అన్నారు.

తెలుగు రాష్ట్రాల్లో బీజేపీకి మంచి ఆదరణ ఉందన్నారు లక్ష్మణ్. రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ట్రిపుల్ తలాక్ బిల్లుతో ముస్లిం మహిళల కష్టాలు తీరుతాయన్న లక్ష్మణ్…మహిళలకు మోడీ అన్నిరంగాల్లో పెద్దపీట వేస్తున్నారన్నారు.

అమెరికాలో నివసిస్తున్న NRIలు భారీగా బీజేపీలో చేరనున్నారని అన్నారు లక్ష్మణ్. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర సాధనలో పనిచేసిన వారంతా ఇప్పుడు బీజేపీ వైపు చూస్తున్నారని అన్నారు. తనను కలిసిన వారంతా… ఫుల్ టైమ్ పార్టీ కోసం పనిచేస్తామని చెప్పారని అన్నారు. NRIల కోసం అక్టోబర్ లో సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. అప్పుడే వారంతా పార్టీ లోకి చేరనున్నట్లు చెప్పారు.

కాంగ్రెస్ మత రాజకీయాలు చేసింది కావునే… ముస్లిం మహిళలకు అన్యాయం జరిగిందని అన్నారు. ట్రిపుల్ తలాక్ ముస్లిం మహిళల చేతిలో తిరుగులేని ఆయుదం అని చెప్పారు. సతీసహగమణం, బాల్య వివాహాలు, ట్రిపుల్ తలాక్ లాంటి అనాగరిక చర్య నుంచి ప్రజలు బయటపడాలని తెలిపారు.. రాజీవ్ గాంధీ ముస్లిం ఓట్లకోసం ముస్లిం లాబోర్డుకు ఎక్కువ అధికారాలు ఇచ్చాడని .. దీంతో ముస్లిం మహిళలకు తీరని అన్యాయం జరిగిందని చెప్పారు.