పండగలకు అవరోధాలు సృష్టించడం కరెక్ట్ కాదు

V6 Velugu Posted on Sep 09, 2021

తిరుమల: రాజకీయ సభల నిర్వహణకు లేని అడ్డంకులు వినాయక చవితి పండుగకు ఎందుకని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు లక్ష్మణ్ అన్నారు. హిందూవుల మనోభావాలు కాపాడేలా ప్రభుత్వాల చర్యలు ఉండాలన్నారు. పండగలకు అవరోధాలు సృష్టించడం కరెక్ట్ కాదన్నారు. వినాయక చవితి వేడుకులపై ఆంక్షలు పెట్టొద్దని సూచించారు. గురువారం ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారి సేవలో ఆయన పాల్గొన్నారు. దర్శనం తర్వాత రంగనాయకుల మండపంలో వేద పండితులు లక్ష్మణ్‎కు ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

దేశమంతా కరోనా నుంచి త్వరగా విముక్తి పొందాలని, అలాగే మన మోడీ ప్రభుత్వం అందిస్తున్న ఉచిత వాక్సిన్‎ను దేశ ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన అన్నారు. 

Tagged Bjp, tirumala, Tirupati, andhrapradesh, coronavirus, BJP Laxman, Vinayaka Chavithi

Latest Videos

Subscribe Now

More News