రాధాకిషన్ రావు ఆస్తులపై ఎంక్వైరీ చేయాలి : చీకోటి ప్రవీణ్

రాధాకిషన్ రావు ఆస్తులపై ఎంక్వైరీ చేయాలి : చీకోటి ప్రవీణ్

బషీర్ బాగ్, వెలుగు: గత బీఆర్ఎస్ ప్రభుత్వ అండదండలతో టాస్క్​ఫోర్స్​మాజీ డీసీపీ రాధాకిషన్ రావు ఎంతో మందిని బెదిరించి పెద్దఎత్తున అక్రమ ఆస్తులు కూడబెట్టుకున్నారని బీజేపీ నాయకుడు చీకోటి ప్రవీణ్ అన్నారు. అతని ఆస్తులపై ఈడీ, సీబీఐతో దర్యాప్తు చేయించాలని మంగళవారం రాష్ట్ర డీజీపీని కలిసి ఫిర్యాదు చేశారు. తర్వాత చీకోటి ప్రవీణ్ మీడియాతో మాట్లాడారు. తన ఫోన్ ను ట్యాప్ చేసి రాధాకిషన్ రావు బెదిరింపులకు పాల్పడినట్లు తెలిపారు. 

గతంలో గజ్వేల్ నియోజకవర్గంలో శివాజీ మహరాజ్ విగ్రహం కూల్చివేతకు గురైనప్పుడు అక్కడికి వెళ్లి నిరసన కార్యక్రమంలో పాల్గొంటే తనపై కేసులు పెట్టారని తెలిపారు. రాధాకిషన్ రావు ఫోన్ చేసి అప్పటి సీఎం కేసీఆర్ నియోజకవర్గానికి ఎలా వెళ్తావని ప్రశ్నించారని.. ఇంకోసారి అక్కడికి వెళ్తే డ్రగ్స్ కేసు, పీడీ యాక్ట్ పెడతానని వార్నింగ్​ఇచ్చినట్టు తెలిపారు. అప్పుడే తన కదలికలు, ఫోన్ వ్యవహారాలు అన్ని తెలుసని అన్నారని.. ఆ సమయంలో కేసులు పెట్టకుండా ఉండేందుకు డబ్బులు డిమాండ్ చేశారని ఆరోపించారు.