
- కలెక్టర్‌తో బీజేపీ జిల్లా ప్రెసిడెంట్ దినేశ్
నిజామాబాద్, వెలుగు : ఇటీవలి వర్షాలకు తడిసిన వడ్లను ప్రభుత్వం కొనుగోలు చేయాలని లేనిచో బాధిత రైతుల పక్షాన ఆందోళన చేపడతామని బీజేపీ జిల్లా ప్రెసిడెంట్ దినేశ్కులాచారి తెలిపారు. సోమవారం ఆయన రైతులతో కలిసి కలెక్టర్ రాజీవ్‌గాంధీని కలెక్టరేట్లో కలిశారు.
ఇప్పటికి 8.60 లక్షల టన్నుల వడ్లు కొనుగోలు చేశారని, ఇంకా 3 లక్షల టన్నుల ధాన్యం అన్నదాతల వద్ద ఉందన్నారు. అందాల పోటీలపై ఉన్న శ్రద్ధ స్టేట్గవర్నమెంట్కు రైతులపై లేదని విమర్శించారు. నాయకులు నూతుల శ్రీనివాస్‌రెడ్డి, పోతన్కర్ లక్ష్మీనారాయణ, నాగోళ్ల లక్ష్మీనారాయణ. పద్మారెడ్డి, హరీశ్‌రెడ్డి, శంకర్‌రెడ్డి, నాయుడి రాజన్న, జనార్ధన్‌రెడ్డి పాల్గొన్నారు.