సినీ ఇండస్ట్రీలో విషాదం.. బిగ్​బాస్​ స్టార్ మృతి

సినీ ఇండస్ట్రీలో విషాదం.. బిగ్​బాస్​ స్టార్ మృతి

బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్, బీజేపీ నాయకురాలు నటి సోనాలి ఫోగట్ గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఇటీవలే గోవా టూర్ వెళ్లిన ఆమె.. నిన్న (సోమవారం) రాత్రి అసౌకర్యంగా ఉన్నట్టు చెప్పడంతో వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. అనంతరం పరిస్థితి విషమించడంతో సోనాలి మృతి చెందినట్టు వైద్యులు వెల్లడించారు. ఆమె మృతిపై  హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. అయితే సోనాలి చనిపోయేకంటే కొన్ని గంటల ముందు కూడా ఫొటోలను, వీడియోలను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ఇంతలోనే ఈ దారుణం చోటుచేసుకోవడంతో ఆమె మృతిపై అందరూ దిగ్ర్భాంతి వ్యక్తం చేస్తున్నారు.

సోనాలి హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో అడంపూర్ స్థానం నుంచి పోటీ చేశారు. కాగా.. కాంగ్రెస్ నుంచి బరిలో నిలిచిన కుల్దీప్ బిష్ణోయ్ చేతిలో ఓడిపోయారు. కుల్దీప్ బిష్ణోయ్  గత నెలలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ఇక, సోనాలి ఫ్యామిలీ విషయానికొస్తే కుమార్తె యశోధర ఫోగట్ ఉంది. ఆమె భర్త సంజయ్ ఫోగట్ 2016లో 42 ఏళ్ల వయసులోనే వారి ఫామ్‌హౌస్‌లో మరణించాడు. టిక్ టాక్ వీడియోలతో పాపులర్ అయిన ఫోగట్ కు సోషల్ మీడియాలో భారీగానే ఫాలోయింగ్ ఉంది. 2006లో టీవీ యాంకర్‌గా రంగప్రవేశం చేసిన ఆమె.. రెండేళ్ల తర్వాత బీజేపీలో చేరారు. 2016లో 'అమ్మా: ఏక్ మా జో లఖోన్ కే లియే బని అమ్మ' అనే టీవీ షోతో సోనాలి నటిగా రంగ ప్రవేశం చేసింది. ఆమె 2019లో 'ది స్టోరీ ఆఫ్ బద్మాష్‌గఢ్' అనే వెబ్ సిరీస్‌లో కూడా నటించింది. అనంతరం రియాలిటీ షో బిగ్ బాస్ 14లో కంటెస్టెంట్‌గా పాల్గొంది.