కేసీఆర్​కు దుబ్బాకలో మీటింగ్​ పెట్టే దమ్ము లేదు

కేసీఆర్​కు దుబ్బాకలో మీటింగ్​ పెట్టే దమ్ము లేదు

అందుకే రైతు వేదిక మీటింగ్‌‌‌‌‌‌‌‌లు

బీజేపీ నేత ఇంద్రసేనారెడ్డి 

హైదరాబాద్, వెలుగు: దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారానికి సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అక్కడ పార్టీ మీటింగ్ పెట్టే దమ్ము కూడా లేదని బీజేపీ సీనియర్ నేత ఇంద్రసేనారెడ్డి ఆరోపించారు. అందుకే సీఎం దుబ్బాకకు రాకుండా రైతు వేదికలు, ధరణి పేరుతో ఇతర జిల్లాల్లో మీటింగ్‌‌‌‌లు పెడుతున్నారన్నారు. ఆరేండ్లలో దుబ్బాకకు కేసీఆర్ చేసిందేంటో చెప్పాలని డిమాండ్ చేశారు. శనివారం ఆయన బీజేపీ స్టేట్ ఆఫీసులో మీడియాతో మాట్లాడుతూ ‘దుబ్బాకలో బీజేపీ గెలిచేది లేదు. పీకేది లేదు’ అని టీఆర్ ఎస్  అనడాన్ని ఆయన తప్పుబట్టారు.‘‘ ఇక్కడ టీఆర్ఎస్ గెలుపుపై మంత్రి హరీష్ రావుకు ఆశలు సన్నగిల్లాయి. రాజకీయాల్లో గెలుపోటములు సహజమేనని ఆయన చేసిన కామెంట్సే ఇందుకు నిదర్శనం. సభ్యత, సంస్కారం గురించి మాట్లాడే కేటీఆర్.. ముందు మీ నాన్నకు అవి నేర్పించు’ అని ఇంద్రసేనారెడ్డి సలహా ఇచ్చారు. తెలంగాణలో మక్కలు కొనటానికి, రైతు వేదికల నిర్మాణానికి కేంద్రమే నిధులిస్తోందని చెప్పారు. తెలంగాణకు అప్పు పుట్టని దుస్థితిని కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తెచ్చుకున్నారని ఇంద్రసేనా రెడ్డి విమర్శించారు.

For More News..

వారంలో 353 మిస్సింగ్ కేసులు

ధరణిలో ఎకరా మ్యుటేషన్‌‌‌కు రూ.2500.. పాస్​ బుక్ డెలివరీకి రూ.300 

హైదరాబాద్ బాలికను ఆదుకున్న యాక్టర్ సోనూసూద్