
హైదరాబాద్, వెలుగు:మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర చేశారంటూ పెట్టిన తప్పుడు కేసుపై హైకోర్టును ఆశ్రయిస్తామని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఏపీ జితేందర్ రెడ్డి అన్నారు. సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర ప్రెస్ మీట్ చూసి జనం నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ‘‘సమాచార హక్కు ద్వారా శ్రీనివాస్‌గౌడ్ తప్పుల్ని బయటపెట్టిన యువకులపైనే మంత్రి హత్యకు కుట్ర అంటూ కేసులు పెట్టారు. ఇది రాజకీయ కుట్రతో పెట్టిన కేసు” అని అన్నారు. పోలీసులు చట్టాన్ని కాపాడతారా? లేక టీఆర్ఎస్ పార్టీ అరాచకాలకు వంత పాడతారా? అని ప్రశ్నించారు. త్వరలోనే అన్ని విషయాలు బయటకు వస్తాయని బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.