
ప్రజా ప్రతినిధులంటే ఎలా ఉండాలి. నలుగురికి ఆదర్శంగా నిలవాలి. తమకున్న అధికారాలను ఉపయోగించి నలుగురు మెచ్చే పనులు చేయాలి. గ్రామాలను, పట్టణాలను ఎలా అభివృద్ధి చేయాలి అని ఆలోచన చేయాలి. తనను నమ్మి గెలిపించిన ప్రజలకు నేనున్నానంటూ భరోసా ఇవ్వాలి. కానీ, కొందరు రాజకీయ నాయకులు ఇవన్నీ పక్కన పెట్టేసి.. నలుగురిలో నీచంగా ప్రవర్తిస్తున్నారు.
మూడేళ్ల కిందట ఓ బీజేపీ నేత అలాంటి పనే చేశాడు. రాజస్థాన్ బీజేపీ రూరల్ కౌన్సిల్ ప్రెసిడెంట్ కైలాష్ గుర్జార్.. ఓ మహిళతో అసభ్యంగా ప్రవర్తించాడు. బహిరంగంగా డ్యాన్సులు పెట్టడమే తప్పంటే.. చూడటానికి చిరాకు పెట్టేవిధంగా వ్యవహరించాడు. పైగా తమ కుటుంబానికి సంబంధించిన పెళ్లిలో అలా చిందేయాల్సి వచ్చిందని.. అందులో తప్పేమిలేదని అప్పట్లోనే అతను తన పనిని సమర్థించుకోవడం గమనార్హం.
అప్పటి వీడియోను ప్రతిపక్ష నాయకులు ఇప్పుడు వాడుకుంటున్నారు. త్వరలోనే 2023 అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సదరు వీడియోను సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. దీంతో అడిగిన వారందరికీ వివరణ ఇచ్చుకోలేక సదరు నేత తల పట్టుకుంటున్నారు.
#BJP4IND sanskari DJ party
— Kerala Pradesh Congress Sevadal (@SevadalKL) September 23, 2023
DJ Party of big BJP leader Kailash Gujjar.
The women are performing choreography sitting on the lap of Sanskari Kailash ji and BJP is getting vindicated!
pic.twitter.com/RXz7bEKjRs