టీఆర్ఎస్ కు కరెంట్ షాక్ గ్యారంటీ : లక్ష్మణ్

టీఆర్ఎస్ కు కరెంట్ షాక్ గ్యారంటీ : లక్ష్మణ్

విద్యుత్ రంగంలో జరుగుతున్న అవకతవకలను సీఎం కేసీఆర్ కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్. బీజేపీ లేవనెత్తే అంశాలన్నీ.. ప్రభుత్వ తప్పిదాలే అన్నారు. అధికారులతో తమకు ఎటువంటి వ్యక్తిగత విద్వేషాలు లేవని చెప్పారు. రేవంత్ రెడ్డి ఇచ్చే ఆధారాలు తమకొద్దని చెప్పిన లక్ష్మణ్.. తమ దగ్గర అన్ని అధారాలున్నాయని అన్నారు. జ్యుడీషియల్ ఎంక్వయిరీకి ప్రభుత్వం ముందుకొస్తే ఆధారాలు బయటపెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. అధికారులను కాల్చి చంపాలన్న రేవంత్ రెడ్డి కామెంట్స్ ను బీజేపీ తప్పుపడుతోందని చెప్పారు.

విద్యుత్ కొనుగోలు  విషయంలో ప్రభుత్వం విచారణకు ముందుకొస్తే ఒకే.. లేదంటే గవర్నర్, కేంద్ర హోంమంత్రి దృష్టికి తీసుకెళ్తామని హెచ్చరించారు లక్ష్మణ్. ప్రభుత్వ అవినీతి, అక్రమాలను నిగ్గు తేల్చే వరకు బీజేపీ పోరాడుతుందని చెప్పారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి కరెంట్ షాక్ గ్యారంటీ అన్నారు.

నాంపల్లిలోని ఓ హోటల్లో బీజేపీ ఆధ్వర్యంలో తెలంగాణ విద్యుత్ రంగ సమస్యలపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. సమావేశంలో లక్ష్మణ్, ఏపీ మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎస్ దాసరి శ్రీనివాస్ లతో  పాటు విద్యుత్ రంగ నిపుణులు, బీజేపీ నేతలు హాజరయ్యారు.