రేవంత్, ఓవైసీ డ్రామాలడుతుండ్రు : లక్ష్మణ్

రేవంత్, ఓవైసీ డ్రామాలడుతుండ్రు : లక్ష్మణ్
  • రేవంత్, ఓవైసీ డ్రామాలడుతుండ్రు
  • ప్రగతి భవన్ వేదికగా కేసీఆర్ ఫక్తు రాజకీయాలు 
  • ఎవరైనా పార్టీ వీడితే వారి ఇష్టం
  • బీజేపీ పార్లమెంటరీ బోర్డు మెంబర్​లక్ష్మణ్

హైదరాబాద్: ‘ప్రగతి భవన్ వేదికగా సీఎం కేసీఆర్ ఫక్తు రాజకీయాలు చేస్తున్నరు. బీఆర్ఎస్, కాంగ్రెస్, మజ్లీస్ లోపాయికారి ఒప్పందంతో పని చేస్తున్నయ్. రేవంత్, ఓవైసీ ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటున్నరు.. ఇది ఒక డ్రామా. రాష్ట్ర, దేశ ఖజానాను దోచుకున్న గజ దొంగలు’ అని బీజేపీ పార్లమెంటరీ బోర్డు మెంబర్​లక్ష్మణ్ ఫైర్​అయ్యారు. 

‘బీఆర్ఎస్, కాంగ్రెస్ రాష్ట్ర ప్రజల హితం కోరేవికావు. రాష్ట్రాన్ని, దేశాన్ని దోచుకున్న పార్టీలు అవి. కేసీఆర్ కు రెండు సార్లు చాన్స్ ఇస్తే బంగారు తెలంగాణను బిక్షమెత్తుకునేలా చేశారు. ఆయనకు మళ్లీ అవకాశమిస్తే చిప్పకూడా మిగలదు. పదేండ్లు ఒక్క రేషన్ కార్డు ఇవ్వని కేసీఆర్.. రేషన్ కార్డు గురించి ఎన్నికల కమిషన్ కు లేఖ రాయడం విడ్డూరంగా ఉంది. ఇది కేవలం ఎన్నికల స్టంట్. బీజేపీ బీసీలను ముఖ్యమంత్రి చేస్తామంటే.. కాంగ్రెస్, బీఆర్ఎస్ చేస్తున్న వ్యాఖ్యలను ప్రజలు గమనిస్తున్నరు. 30 ఏండ్లుగా జరుగుతున్న ఎస్సీ వర్గీకరణ పోరాటానికి పరిష్కారం చూపుతామని మోదీ హామీ ఇచ్చారు. పెట్రోల్, డీజిల్ పైన పది రూపాయలు తగ్గించనీ కేసీఆర్.. 450కే గ్యాస్ సిలిండర్ ఇస్తానంటే ప్రజలు నమ్మరు. ప్రగతి భవన్ లో పడుకునే నాయకుడు కావాలా.. ప్రజల కోసం పని చేసే మోదీ కావాలా? రేవంత్, ఓవైసీ ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటున్నరు.. ఇది ఒక డ్రామా. రాష్ట్ర, దేశ ఖజానాను దోచుకున్న గజ దొంగలు. బీజేపీ మేనిఫెస్టో ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించేలా ఉంటుంది. కాంగ్రెస్ 59 మంది ఎమ్మెల్యేలు గెలిచిన ఒక్కరూ పార్టీలో ఉండరని ఆ పార్టీ ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి చెబుతున్నరు. కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు అందరూ బీఆర్ఎస్ కండువా కప్పుకుంటారు. విజయశాంతి పార్టీని వీడరని నా నమ్మకం. స్వప్రయోజనాల కోసం ఎవరైనా పార్టీ వీడితే వారి ఇష్టం’ అని లక్ష్మణ్ అన్నారు.