KCR ఓ అప్పుల అప్పారావు: లక్ష్మణ్

KCR ఓ అప్పుల అప్పారావు: లక్ష్మణ్

అసెంబ్లీ సమావేశాలను పార్టీ సమావేశాల్లా సీఎం కేసీఆర్ నడపడం దురదృష్టకరమని అన్నారు రాష్ట్ర బీజేపీ చీఫ్ లక్ష్మణ్.  రాష్ట్ర ప్రభుత్వానికి కాగ్ మొట్టికాయలు వేసినా సరిదిద్దుకోకుండా ఎదురుదాడికి దిగుతున్నారని ఆయన అన్నారు. ఇప్పటివరకు ప్రజల నెత్తిమీద 3లక్షల కోట్ల రూపాయల అప్పును పెట్టారని చెప్పారు. అప్పుల అప్పారావు పాత్రను కేసీఆర్ పోషిస్తున్నారని అన్నారు. ప్రభుత్వ అసమర్ధతను ఆర్థిక మాద్యంతో ముడిపెడుతున్నారని చెప్పారు.  సంపన్న రాష్ట్రాన్ని కేసీఆర్ చేతిలో పెడితే అప్పుల రాష్ట్రంగా మార్చారని లక్ష్మణ్ ఎద్దేవాచేశారు.

కేసీఆర్ ప్రభుత్వం ఆరు సంవత్సరాలుగా రాష్ట్రంలో ఒక శాతం కూడా అక్షరాస్యతను పెంచలేదని అన్నారు లక్ష్మణ్. TRS ప్రభుత్వం విద్యావ్యవస్థను పూర్తిగా నాశనం చేసిందని అన్నారు. రాష్ట్రంలో BJP ప్రభుత్వం వస్తే ప్రజాస్వామిక పాలన వస్తుందని… మందు పాలన పోయి ముందు చూపు పాలన వస్తది  చెప్పారు.  TRS పార్టీ అందరి పార్టీ కాదని కొందరి పార్టీ అని అన్నారు… ఏ ప్రాంతీయ పార్టీ అయిన కుటుంబ చరిత్ర తప్ప ఏమీ లేదని చెప్పారు. రాష్ట్రంలో విశ్వవిద్యాలయాలను మొత్తం బ్రష్టు పట్టించిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానికి దక్కుతుందని అన్నారు.