ఖబరస్థాన్​ స్థలంపై చర్చకు సిద్ధమా? : బీజేపీ నేత మర్రి శశిధర్ రెడ్డి

ఖబరస్థాన్​ స్థలంపై చర్చకు సిద్ధమా? : బీజేపీ నేత మర్రి శశిధర్ రెడ్డి

పద్మారావునగర్​, వెలుగు:  ఓట్ల కోసం ముస్లింల భావోద్వేగాలను రాజకీయంగా వాడుకోవడం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్​కు తగదని మాజీ మంత్రి, బీజేపీ నేత మర్రి శశిధర్ రెడ్డి విమర్శించారు. గురువారం ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడుతూ.. బేగంపేటలోని వివాదాస్పద స్థలంపై హైదరాబాద్ పబ్లిక్​ స్కూల్ వేసిన కోర్టు కేసు పెండింగ్​లో ఉండగానే మంత్రి హడావుడిగా ముస్లింల శ్మశానవాటిక (ఖబరస్థాన్ ) కు శంకుస్థాపన చేయడమేంటని ప్రశ్నించారు. 2 ఎకరాల స్థలం అంతా బండరాళ్లతో నిండి ఉందని, అందులో ఖననం ఎలా చేస్తారని మండిపడ్డారు.

మంత్రి రాజకీయ అవసరాలకు ముస్లిం సోదరులు మోసపోవద్దని సూచించారు. సదరు స్థలంపై బహిరంగ చర్చకు  సిద్ధమని మంత్రికి ఆయన సవాల్ విసిరారు. శిలాఫలకంపై ప్రాజెక్ట్ వ్యయం రూ 2.95 కోట్లుగా చూపించారని, పనులకు రూ 2.34 కోట్లు అంటూ  టెండర్​లో పేర్కొన్నారని, తేడా ఎందుకని శశిధర్ రెడ్డి ప్రశ్నించారు.   బీజేపీ నేతలు దయానంద్, మర్రి పురూరవరెడ్డి, ఉస్మాన్​, షేక్​ గౌస్​, యూసుఫ్​ ఉన్నారు.