కేసీఆర్ అండతోనే షర్మిల కొత్త పార్టీ

కేసీఆర్ అండతోనే షర్మిల కొత్త పార్టీ

కేపీవీ, కేసీఆర్‌ల అండతోనే షర్మిల తెలంగాణలో పార్టీ పెడుతోందని బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ అన్నారు. కేసీఆర్ తన పదవిని పదిలం చేసుకునే ఎత్తుగడలో ఇదీ ఒక భాగమని ఆయన అన్నారు. మధ్యంతర ఎన్నికలకు కేసీఆర్ సిద్ధమా అని ఆయన సవాల్ విసిరారు. షర్మిల తెలంగాణలో కొత్త పార్టీ పెడుతుందనే ప్రచారంపై ఆయన స్పందించారు.

‘కేసీఆర్ ఇంట్లోనే కుట్రలు జరుగుతున్నాయి. పదవి మూడునెలల ముచ్చటే. కేటీఆర్ మరో చంద్రబాబు అవతారం ఎత్తబోతున్నారనే భయం కేసీఆర్‌కి పట్టుకుంది. ఈటల మాటలు ఈటళ్లా దిగుతున్నాయి. కేటీఆర్ మద్దతుదారుల ఒత్తిడి పెరిగింది. కేసీఆర్ అధికారంలోకి వచ్చినప్పటినుంచి ప్రజల జీవితాలతో ఆడుకుంటూనే ఉన్నాడు. పద్దతి ప్రకారంగా సామాజిక వర్గాలను వంచిస్తున్నాడు. దళిత ముఖ్యమంత్రి, మూడెకరాల భూమి ఇస్తామంటూ మోసం చేశాడు. గిరిజన తండాలలో పరిణామాలు దారుణంగా ఉన్నాయి. బలహీన వర్గాల ఆత్మ గౌరవ భవనాల నిర్మాణాల పేరుతో వంచించాడు.
తెలంగాణ పోరాటంలో ఉద్యోగుల పాత్ర కీలకం. అలాంటి ఉద్యోగులకు కేసీఆర్ చేసిందేం లేదు. తక్కువ ఫిట్ మెంట్ ఇస్తూ వారికి అన్యాయం చేస్తున్నాడు. తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయని చెప్పి నియామకాలు చేపట్టకుండా యువతను మోసం చేస్తున్నాడు. సకలజనులు కలిసి సాధించిన తెలంగాణలో సకలజనులను మోసం చేసిన చరిత్ర కేసీఆర్‌కే దక్కుతుంది. బీజేపీ నేతలు, కార్యకర్తలపై ఇష్టారీతిన కేసులు పెడుతూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై దురుసుగా ప్రవర్తించిన ఘటనను ఎవరూ మర్చిపోలేదు. చీటికీ మాటికి కేసులు పెట్టి హింసిస్తున్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య పరిపాలన సాగడం లేదు. పోలీసుల పాలనే రాష్ట్రంలో నడుస్తుంది. గిరిజనుల హక్కులను ప్రభుత్వం కాలరాస్తుంది. గిరిజనులపై పోలీసుల దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాం. నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి వేధిస్తున్నారు. భూ బకాసురులతో జతకలిసి గిరిజనుల భూములు లాగేసుకుంటున్నారు. గుర్రంపోడు ఘటనపై ఎస్టీ కమిషన్‌కు పిర్యాదు చేస్తాం. కోర్టు తీర్పులకు భిన్నంగా అధికారులు వ్యవహరిస్తుంటే.. కేసీఆర్ ఏం చేస్తున్నారో సమాధానం చెప్పాలి. బీజేపీ నేతలపై పెట్టిన అక్రమకేసులను వెంటనే వెనక్కి తీసుకొని, ఘటనపై న్యాయవిచారణ జరపాలి.

జీహెచ్ఎంసీ మేయర్ ఎన్నికపై బీజేపీ స్టాండ్ మంగళవారం ప్రకటిస్తాం. మేయర్ అభ్యర్థి ఎన్నికలో టీఆర్ఎస్, కాంగ్రెస్, మజ్లీస్ ఏకమయ్యాయి. మజ్లీస్‌కు ఎమ్మెల్సీ ఇచ్చేందుకు ఒప్పందం కుదిరింది. రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతుంటే.. టీఆర్ఎస్ ఒక్క స్థానానికి మాత్రమే అభ్యర్థిని ప్రకటించడం వెనక అంత్యర్యం ఏమిటో చెప్పాలి. కమ్యూనిస్టు అభ్యర్థికి టీఆర్ఎస్ మద్దతు ఇవ్వడం దేనికి? కాంగ్రెస్, మజ్లీస్ నేతలపై ఉన్న కేసుల విచారణ ఆలస్యం అయ్యేలా చేసి, బీజేపీ నేతలపై మాత్రం విచారణ ముగించి శిక్షపడేలా చేస్తూ రాజకీయ క్రీడకు తెరలేపారు’ అని ఆయన అన్నారు.

For More News..

తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకొస్తా

ఏడు నెలల్లో ఏడుసార్లు అమ్మకానికి గురైన 18 ఏళ్ల యువతి

ఎర్రకోటపై దాడికి కారణమైన దీప్ సిద్దు అరెస్ట్