
రాజన్న రాజ్యంలో దోచుకోవడం దాచుకోవడమేనన్నారు బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్. రాజన్న రాజ్యంలో పనిచేసిన అధికారులు ఇప్పటికీ జైల్ చుట్టు తిరుగుతున్నారన్నారు. ఇప్పుడు టిఆర్ఎస్ లో మంత్రిగా వాళ్ళు కోర్టుల చుట్టు తిరుగుతున్నారని.. ఏపీ సీఎం జగన్ ఇప్పటికి కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. పార్టీలను చీల్చిన చరిత్ర కూడా రాజన్న రాజ్యంలో ఉందన్నారు. షర్మిలను వెనక నుంచి నడిపిస్తుంది కేసీఆరే అని అన్నారు. షర్మిలతోని పార్టీ పెట్టించి..ఓట్లు చిలడం వల్ల లబ్ది పొందాలని కేసీఆర్ చూస్తున్నారన్నారు. భట్టి విక్రమార్క,ఉత్తమ్ కుమార్ రెడ్డి,జీవన్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని కలిపింది కేసీఆర్ నన్నారు. కేసీఆర్ ఎన్ని ఎత్తులు వేసినా టీఆర్ఎస్,ఎంఐఎం, కాంగ్రెస్, షర్మిల అందరూ కలిసినా బీజేపీ విజయాన్ని అడ్డుకోలేరన్నారు.