
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీనే గెలిపించాలని ప్రజలను బీజేపీ నేత, తమిళనాడు కో ఇన్ చార్జ్ పొంగులేటి సుధాకర్ రెడ్డి కోరారు. మన దేశాన్ని ప్రపంచంలో ఉన్నతమైన స్థానంలో నిలబెట్టిన మోదీ వెంట తెలంగాణ ప్రజలు ఉన్నారన్నారు.
ఈసారి బీజేపీకి ఓటు వేసి అత్యధికమైన సీట్లు ఇవ్వాలని సోమవారం ఒక ప్రకటనలో కోరారు. కుటుంబ అవినీతి పాలనకు, గ్యారంటీ లేని వారంటీలు ఇస్తున్న కాంగ్రెస్ పార్టీకి చరమగీతం పాడాలన్నారు. బీఎల్ సంతోష్ హంగ్ వస్తుందని అనలేదని, ఆయన కామెంట్లను అధికార పార్టీ తప్పుగా ప్రచారం చేస్తోందని ఆరోపించారు.