మంచిర్యాలలో ఎమ్మెల్యే  ప్రేమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రావు అరాచకాలు : రఘునాథ్ వెరబెల్లి

మంచిర్యాలలో ఎమ్మెల్యే  ప్రేమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రావు అరాచకాలు : రఘునాథ్ వెరబెల్లి
  • వర్గపోరుతో ప్రజల్లో భయాందోళనలు
  • బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్ వెరబెల్లి

హైదరాబాద్, వెలుగు: మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సాగర్ రావు జిల్లాలో అరాచకాలు సాగిస్తున్నారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్ ఆరోపించారు. కొద్ది రోజులుగా ఎమ్మెల్యే ప్రేమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సాగర్ రావు వర్గంచేస్తున్న దాడులతో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతోందని, ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీ స్టేట్ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు. మూడేండ్లుగా మంచిర్యాల జిల్లాలో ప్రతిపక్ష పార్టీల నాయకులు, వ్యాపారులపై దాడులు జరుగుతున్నా, అక్రమ కేసులు బనాయిస్తున్నా పోలీస్ యంత్రాంగం ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నారు.

యువతను గంజాయి, డ్రగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు బానిసలుగా మార్చి దాడులను ప్రేరేపిస్తున్నారని ఆరోపించారు. ఎంతో ప్రశాంతంగా ఉన్న మంచిర్యాలలో కాంగ్రెస్ నాయకులు వర్గాలుగా విడిపోయి పరస్పరం దాడులు చేసుకోవడం వల్ల ప్రజలు కంటిమీద కునుకు లేకుండా గడపాల్సి వస్తోందన్నారు. జిల్లాలో శాంతిభద్రతలను కాపాడటంతో పాటు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సాగర్ రావుపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.