బండి సంజయ్ ను తప్పించడం అన్యాయం : మాజీ ఎంపీ రవీంద్ర నాయక్

బండి సంజయ్ ను తప్పించడం అన్యాయం : మాజీ ఎంపీ రవీంద్ర నాయక్
  • ఆధారాల్లేకుండా పీఎం మాట్లాడడు
  • కేసీఆర్ పై కేసు నమోదు చేయాలి
  • డైనమిక్ పీసీసీ చీఫ్​ రేవంత్ రెడ్డి
  • బండిని తప్పించడం అన్యాయం
  • మాజీ ఎంపీ రవీంద్ర నాయక్

హైదరాబాద్: విజయ్ సంకల్ప్ సభకు తనను పిలవకుండా అవమానించారని మాజీ ఎంపీ రవీంద్ర నాయక్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇవాళ హైదరాబాద్ లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. వరంగల్ సభలో ప్రధాని మోదీ కేసీఆర్ సర్కారు అవినీతికి పాల్పడిందని విమర్శించారని, పీఎం ఆధారాల్లేకుండా అలాంటి వ్యాఖ్యలు చేయరని వెంటనే సీఎం కేసీఆర్ పై సుమోటో గా కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. తాను కేవలం కేసీఆర్ ను ఓడించేందుకే బీజేపీలోకి వచ్చానని చెప్పారు. సీతక్కను సీఎం చేస్తానంటూ పీసీసీ చీఫ్ రేవంత్ చేసిన వ్యాఖ్యలను తాను స్వాగతిస్తున్నానని చెప్పారు. రేవంత్ ఒక డైనమిక్ పీసీసీ చీఫ్ అని పేర్కొన్నారు. పార్టీలో బీసీలు ఎదుగుతున్న క్రమంలో బండి సంజయ్ ని రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించడం అన్యాయమని పేర్కొన్నారు. సంజయ్ ని తొలగిస్తే ఆయన స్థానంలో మరో బీసీకి అవకాశం ఇచ్చి ఉండాల్సిందన్నారు.