బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌లోకి తుల ఉమ, స్రవంతి

బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌లోకి తుల ఉమ, స్రవంతి
  • వైఎస్సార్​టీపీని వీడిన గట్టు రాంచందర్‌‌‌‌‌‌‌‌రావు

హైదరాబాద్, వెలుగు: బీజేపీ నాయకురాలు తుల ఉమ, కాంగ్రెస్ లీడర్ పాల్వాయి స్రవంతి, వైఎస్సార్​టీపీ నేత గట్టు రాంచందర్‌‌‌‌‌‌‌‌రావు బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌లో చేరారు. ఆది, సోమవారం జరిగిన వేర్వేరు కార్యక్రమాల్లో మంత్రులు హరీశ్‌‌‌‌రావు, కేటీఆర్‌‌‌‌‌‌‌‌ వీరికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వేములవాడ టికెట్ ఇచ్చి, బీ ఫాం వేరొకరికి ఇవ్వడంతో ఆగ్రహానికి గురైన తుల ఉమ బీజేపీకి రాజీనామా చేశారు. 

కేటీఆర్ సమక్షంలో ఆమె బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌లో చేరారు. ఇచ్చిన మాటకు బీజేపీ నాయకులు కట్టుబడి ఉండరని, తనకు టికెట్ ఇచ్చినట్టే ఇచ్చి మోసం చేశారని ఉమ విమర్శించారు. బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌లో చేరిన తర్వాత తిరిగి తన సొంతింటికి వచ్చినట్టుగా ఉందన్నారు. తుల ఉమ  టికెట్ వ్యవహారంతో మహిళలు, బీసీల పట్ల బీజేపీకి ఉన్న వ్యతిరేక వైఖరి బయట పడిందని కేటీఆర్ అన్నారు. కేసీఆర్ సూచన మేరకు తానే తుల ఉమకు ఫోన్‌‌‌‌ చేసి మాట్లాడానన్నారు. తన ఆహ్వానాన్ని మన్నించి ఆమె బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌లో చేరడం సంతోషంగా ఉందన్నారు. ఆమెకు గతంలో ఉన్నదాని కంటే మంచి హోదా, బాధ్యతలు అప్పగించి గౌరవిస్తామన్నారు. 

స్రవంతి భవిష్యత్తుకు నాది హామీ: కేటీఆర్

మునుగోడు టికెట్ ఇవ్వకపోవడంతో అసంతృప్తిగా ఉన్న కాంగ్రెస్ లీడర్ పాల్వాయి స్రవంతి కేటీఆర్ సమక్షంలో బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌లో చేరారు. స్రవంతిని ఓ సోదరుడిగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నానని, ఆమెకు పార్టీ అండగా ఉంటుందని కేటీఆర్ అన్నారు. తన భవిష్యత్తు గురించి కాకుండా, తన వెంట నడిచిన నాయకులు, కార్యకర్తల భవిష్యత్తు గురించి ఆమె తనను అడిగారని కేటీఆర్ తెలిపారు. వారి భవిష్యత్తును తాను తీసుకుంటానన్నారు. పార్టీ కార్యకర్తలు, నాయకుల అభిప్రాయం మేరకు బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌లో చేరానని స్రవంతి అన్నారు. 

ములుగులో సీతక్క గెలవదు: హరీశ్‌‌‌‌రావు

వైఎస్సార్‌‌టీపీ లీడర్ గట్టు రాంచందర్ రావు, వివిధ జిల్లాల పార్టీ కో ఆర్డినేటర్లు మంత్రి హరీశ్‌‌‌‌రావు సమక్షంలో బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌లో చేరారు. వారందరికీ పార్టీలో తగిన గుర్తింపు ఇస్తామని హరీశ్‌‌‌‌ హామీ ఇచ్చారు. బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ మరోసారి అధికారంలోకి వస్తుందని, హ్యాట్రిక్ కొట్టబోతున్నామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం వైఎస్సార్​ టీపీ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని హరీశ్ కోరారు. 

వైఎస్సార్​టీపీలో ఉన్నట్టు సూటిపోటి మాటలు, అవహేళనలు బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌లో ఉండబోవన్నారు. ములుగు జిల్లాకు చెందిన బీజేపీ నేత తాటి కృష్ణ కూడా బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌లో చేరారు. ములుగులో సీతక్క ఓడిపోతుందని ఈ సందర్భంగా హరీశ్‌‌‌‌రావు అన్నారు. ఆమె సోషల్ మీడియాలో హడావుడి చేయడం తప్పితే, నియోజకవర్గానికి చేసిందేమి లేదన్నారు. ఓడిపోతున్నానని తెలిసి, నోటికి వచ్చినట్టు మాట్లాడుతోందని అన్నారు. 

ALSO READ : కన్హయ్య లాల్ హత్య వెనుక బీజేపీ హస్తం: గెహ్లాట్​

బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ అభ్యర్థి నాగజ్యోతి గెలుపు కోసం కృషి చేయాలని తాటి కృష్ణకు హరీశ్​రావు సూచించారు. కాగా, జూలూరి గౌరీ శంకర్‌‌ రాసిన ‘‘కాంగ్రెస్ చేసిందేంటి” అనే పుస్తకాన్ని ప్రగతి భవన్‌ క్యాంప్ ఆఫీసులో కేటీఆర్‌‌ సోమవారం ఆవిష్కరించి, మాట్లాడారు. రాష్ట్రంలో మూడోసారి గులాబీ జెండా ఎగరబోతున్నదని అన్నారు.