అభివృద్ధిలో ముందుండాల్సిన తెలంగాణ.. అవినీతిలో నంబర్ వన్ గా ఉందన్నారు బీజేపీ సీనియర్ నేత వివేక్ వెంకటస్వామి. రాష్ట్రం గూండాల రాజ్యంగా మారిందని విమర్శించారు. లాయర్ల హత్య కేసులో ఎవిడెన్స్ ఉన్నా కూడా పోలీసులు టీఆర్ఎస్ కార్యకర్తల్లాగా పనిచేస్తున్నారని ఆరోపించారు. ఇంటికో ఉద్యోగం అని చెప్పిన సీఎం… తన ఇంట్లో అందరికీ పదవులు ఇప్పించుకున్నారని అన్నారు. ఉద్యమకారులకు టీఆర్ఎస్ లో చోటులేకుండా పోయిందన్నారు. కేసీఆర్ పేరును కల్వకుంట్ల కమిషనర్ రావుగా మార్చామన్నారు. కోల్, డీజిల్ దందా చేస్తున్న సింగరేణి సీఎండీని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు వివేక్.
