- కేరళ ఎమ్మెల్యే రాహుల్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు
పథనంతిట్ట: కేరళలోని పాలక్కడ్ నియోజకవర్గ ఎమ్మెల్యే రాహుల్ మామ్ కూటతిల్‌ను అత్యాచార కేసులో పోలీసులు అరెస్టు చేశారు. శనివారం అర్ధరాత్రి 12:30 గంటలకు పాలక్కడ్‌లో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఎమ్మెల్యే తనపై అత్యాచారం చేశారని పథనంతిట్ట జిల్లాకు చెందిన వివాహిత ఫిర్యాదుతో ఈ నెల 8న పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం కెనడాలో ఉంటున్న బాధితురాలు.. వీడియో కాన్ఫరెన్స్‌లో కంప్లైంట్ చేశారు.
‘‘2024లో ఎమ్మెల్యే రాహుల్‌తో నాకు పరిచయం ఏర్పడింది. అప్పటికే నాకు పెళ్లయింది. భర్తతో మనస్పర్ధలు ఉన్నాయి. ఈ క్రమంలో నన్ను పెళ్లి చేసుకుంటానని ఎమ్మెల్యే మాట ఇచ్చాడు. తర్వాత 2024 ఏప్రిల్ లో ఒక లాడ్జిలో నాపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అతను రేప్ చేయడంతో నేను ప్రెగ్నెంట్ అయ్యాను. ఈ విషయం తెలిసి అబార్షన్ చేసుకోవాలని ఒత్తిడి చేశాడు. పలు సందర్భాల్లో డబ్బు కూడా తీసుకున్నాడు” అని ఆ మహిళ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
