సీఎంఆర్‌‌ఎఫ్‌తో పేదలకు మేలు : ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య

సీఎంఆర్‌‌ఎఫ్‌తో పేదలకు మేలు : ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య
  • ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య

యాదగిరిగుట్ట, వెలుగు: సీఎం రిలీఫ్ ఫండ్ అనేది ఆపదలో ఉన్న పేద ప్రజలకు ఆపన్న హస్తం లాంటిదని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య పేర్కొన్నారు. యాదగిరిగుట్టలోని బీర్ల నిలయంలో ఆలేరు నియోజకవర్గ ఎనిమిది మండలాల్లోని లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఆదివారం ఆయన పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం రిలీఫ్ ఫండ్ అనేది ఒకప్పుడు పైరవీలు, పలుకుబడి కలిగిన నాయకులకు మాత్రమే అందేదని, కానీ ప్రజా ప్రభుత్వం వచ్చాక మారుమూల గ్రామాల నిరుపేదలకు సైతం సీఎంఆర్ఎఫ్ ఫలాలు అందుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలేరు మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ ఐనాల చైతన్యా మహేందర్ రెడ్డి, తుర్కపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు శంకర్ నాయక్, వర్కింగ్ ప్రెసిడెంట్ చాడ భాస్కర్ రెడ్డి తదితరులు ఉన్నారు.