ఎస్‌‌జీఎఫ్‌‌ అండర్‌‌ 17 కబడ్డీ విన్నర్‌‌గా రాజస్తాన్‌‌

ఎస్‌‌జీఎఫ్‌‌ అండర్‌‌ 17 కబడ్డీ విన్నర్‌‌గా రాజస్తాన్‌‌
  • రన్నరప్‌‌గా యూపీ, మూడో స్థానంలో తెలంగాణ

పినపాక, వెలుగు : భద్రాద్రి జిల్లా పినపాక మండలం ఏడూళ్లబయ్యారంలో నిర్వహించిన 69వ ఎస్‌‌జీఎఫ్‌‌ అండర్​–-17 నేషనల్​లెవల్‌‌ కబడ్డీ ట్రోఫీని రాజస్తాన్‌‌ టీమ్‌‌ దక్కించుకుంది. ఆదివారం జరిగిన సెమీస్‌‌లో తెలంగాణపై ఉత్తర్‌‌ప్రదేశ్‌‌, హరియాణాపై రాజస్తాన్‌‌ గెలిచి ఫైనల్‌‌కు చేరాయి. ఫైనల్‌‌లో రాజస్తాన్‌‌, ఉత్తర్‌‌ప్రదేశ్‌‌ టీమ్స్‌‌ చెరో 27 పాయింట్లు సాధించడంతో మ్యాచ్‌‌ టై అయింది. తర్వాత ఇరు జట్లకు చెరో ఐదు రైడ్స్‌‌ ఇచ్చారు.

ఇందులో రాజస్తాన్‌‌ ఆరు, యూపీ నాలుగు పాయింట్లు సాధించింది. దీంతో రెండు పాయింట్ల తేడాతో రాజస్తాన్‌‌ టీమ్‌‌ విజయం సాధించి టైటిల్‌‌ను దక్కించుకోగా.. యూపీ రన్నరప్‌‌గా నిలిచింది. తర్వాత మూడో స్థానం కోసం సెమీస్‌‌లో ఓడిన తెలంగాణ, హరియాణా మధ్య మ్యాచ్‌‌ నిర్వహించగా.. తెలంగాణ విజయం సాధించింది. అనంతరం ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, కలెక్టర్ జితేశ్ వి.పాటిల్, డీఈవో బి.నాగలక్ష్మి విజేతలకు ట్రోఫీలు అందజేశారు.