జవహర్‌నగర్, వెలుగు: జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని యాప్రల్ అటవీ ప్రాంతంలో ఏడాదిన్నర చిన్నారి(బాలిక) మృతదేహం కనిపించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యాప్రల్ అటవీ ప్రాంతంలోని నడక దారిలో వెళ్తున్న శివకుమార్‌కు చిన్నారి కనిపించడంతో 100కు కాల్ చేసి సమాచారం ఇచ్చాడు.
సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు శిశువును పరిశీలించగా, అప్పటికే మృతిచెందింది. ఒంటిపై గాయాలు ఉన్నట్లు తెలిపారు. చిన్నారి బంధువులు ఎవరైనా ఉంటే 87126 62103 నంబర్‌కు ఫోన్ చేయాలని సూచించారు.
